మహా శివరాత్రీ పూజ -ఆరాధన* 21-ఫిబ్ర-2020 శుక్రవారం #OMKARAMAYURVEDAM

శివరాత్రి పూజ -ఆరాధన* 21-ఫిబ్ర-2020 శుక్రవారం
--------------------------------------------------
*పూజ, వ్రతం చేయడం కుదరని వారు మరియు గ్యాస్-ఉదర సంబంధించిన రోగము వుండి ఉపవాసం చేయకూడని వారు అనవసరంగా మాటలు, ఆలోచనలు చేయకుండా, ఉద్వేగాలు, ఉద్రేకాలు కలిగించే ఆహారాలు తినకుండా - మనసులో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టు ఊహించుకుంటూ నిరంతరం "ఓం నమశ్శివాయ" అని మననం చేసుకుంటూ ఉన్నా చాలు. ఈ మానసిక పూజ కూడా అత్యుత్తమ మైనదే.*
*శివరాత్రి పూజ -ఆరాధన ఎలా చేయాలి ??*
....అని ఒకసారి పార్వతీదేవి పరమశివుడినే శివరాత్రి గురించి ఆడుగుతుంది.
అప్పుడు శివుడు
"... *శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నా సరే తనెంతో సంతోషిస్తానని"* చెబుతాడు.
ఆయన చెప్పిన దాని ప్రకారం, *ఆ రోజు పగలంతా నియమ నిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది*
*మరునాడు 5 గురు పెదాలకి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి.*
*దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.*
-------------------------------------------------
*మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.*
*గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.*
*మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి.*
*పూజా సమయంలో శివఅష్టోత్తరము,లేదా శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయి.*
*అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి.*
*శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని తెలియజేస్తున్నారు గురువులు.*
-------------------------------------------------- ఓం నమఃశివాయ 🌹🙏🌹
మీ శ్రేయోభిలాషి జ్యోతిష్య బ్రహ్మ
ఓంకారం గురూజీ మహారాజ్
ఓంకారం ఫౌండేషన్
ఓంకారం ఆయుర్వేదం
OM6 TV Live Show #OMKARAMAYURVEDAM HYD
Guruji Maharaj Best Astrology Numerologist Vastu All Remedies Hyd.india Contact.
8331085555,-9059406999
OmkaramFoundations
............మరింత సమాచారం కోసం ఈ ఛానెల్ లైక్ చేసి బెల్ బటన్ నొక్కండి
మేము పెట్టె ఆధ్యాత్మిక ఆయుర్వేద ఆరోగ్య సామజిక వార్తలు సమాచారం వీడియోలు మీకు ముందుగానే సమాచారం తెలుస్తుంది...
మీ బందు మిత్రులకి షేర్ చేయండి.

Comments